News August 28, 2024
JMMకు మాజీ CM చంపై సోరెన్ రాజీనామా

ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ JMM(ఝార్ఖండ్ ముక్తి మోర్చా)కు రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన లేఖ విడుదల చేశారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆగస్టు 30న BJPలో చేరనున్నట్లు ప్రకటించారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు చంపై సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా నవంబర్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.
Similar News
News December 8, 2025
ప.గో: బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
News December 8, 2025
సమ్మిట్ గెస్టుల కోసం తెలంగాణ చిరుతిళ్లు

TG: ఈరోజు, రేపు జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను వారికి అందజేయనున్నారు. అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు ఉన్నాయి. ఇక లంచ్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీ, విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను రెడీ చేస్తున్నారు.
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.


