News July 19, 2024
నేడు వినుకొండకు మాజీ సీఎం జగన్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండకు రానున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉ.10 గంటలకు బయల్దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండకు చేరుకుంటారు.
Similar News
News November 23, 2025
ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
News November 23, 2025
11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

AP: 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు కళ్యాణం శివశ్రీనివాసరావు, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్‌కు సత్యనారాయణ రాజు, ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌కు విక్రమ్, ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్‌కు రామ్‌ప్రసాద్, స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీకి ముక్తియార్‌ను నియమించింది.
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.


