News April 7, 2025
రేపు రాప్తాడుకు మాజీ సీఎం జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
Similar News
News April 7, 2025
చితక్కొట్టిన ఆర్సీబీ.. ముంబై టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 221/5 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ పాటిదార్ (64), విరాట్ కోహ్లీ (67), పడిక్కల్ (37), జితేశ్ శర్మ (40) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి ధాటికి ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పాండ్య , బౌల్ట్ చెరో 2 వికెట్లు తీశారు. ముంబై విజయ లక్ష్యం 222.
News April 7, 2025
ఆదాయం లేకుండా GDP ఎలా పెరిగింది బాబూ: బొత్స

AP: అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని సీఎం చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు ఆదాయమే లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుందని నిలదీశారు. ‘కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ధైర్యం ఆయనకు లేదు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో ఉన్న చెత్త తీయించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News April 7, 2025
HCU నుంచి బందోబస్తు ఉపసంహరణ

TG: HCU వీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు. పౌర సంఘాలు, ఉపాధ్యాయ జేఏసీ విజ్ఞప్తితో క్యాంపస్ నుంచి పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. కాగా విద్యార్థులపై కేసులను వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.