News August 5, 2024
రేపు విజయవాడకు మాజీ సీఎం జగన్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. జగ్గయ్యపేటలో దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తను పరామర్శించనున్నారు. శుక్రవారం నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సుబ్బారాయుడిని పోలీసుల ముందు టీడీపీ నేతలు చంపారని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News April 8, 2026
గ్రీస్‌లో 15ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధం!

గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రకటించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, SMకి వ్యసనపరులుగా మారుతున్న చిన్నారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేరెంట్స్ అనుమతి ఉన్నా 15 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లోనూ SMను బ్యాన్ చేశారు.
News April 8, 2026
ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్: ట్రంప్

ఇరాన్‌తో సీజ్‌ఫైర్ కొనసాగుతున్న వేళ ఇతర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్స్ విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News April 8, 2026
టెన్త్, ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే APలో ఈ నెల 3వ వారంలో ఇంటర్, నెలాఖరున టెన్త్ రిజల్ట్స్ వస్తాయని సమాచారం. TGలో ఈ నెల 10లేదా12వ తేదీ అని ప్రచారం జరిగినా 15-20వ తేదీ లోపు ఇంటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. అటు టెన్త్ పరీక్షలు ఇంకా ముగియలేదు. పూర్తైన పేపర్ల వాల్యుయేషన్ జరుగుతుండటంతో ఈ నెలాఖరుకే ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.


