News August 22, 2024
రేపు విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటన

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం ఘటనలో గాయపడి, అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రేపు ఉ.11 గంటలకు పరామర్శించనున్నారు. ఉ.8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉ.10కి ఆయన విశాఖ చేరుకుంటారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శిస్తారని పేర్కొంది.
Similar News
News December 3, 2025
‘టీ’ దోమతో జీడి మామిడి తోటల్లో కలిగే నష్టం

రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్న తరుణంలో జీడిమామిడి తోటల్లో టీ-దోమ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల పంట ఉత్పత్తిలో సుమారు 30-40% నష్టపోయే ప్రమాదం ఉంది. టీ దోమలు చెట్టు లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. పూత రెమ్మలను ఆశిస్తే పూత మాడి, చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. కొత్త కొమ్మలు, రెమ్మలపై ఆశిస్తే చెట్టు అభివృద్ధి క్షీణిస్తుంది. గింజలను ఆశిస్తే గింజలు వడిలి, తొలిదశలోనే రాలిపోతాయి.
News December 3, 2025
ఇది ‘RU-KO’ షో

రాయ్‌పూర్ వేదికగా SAతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14) నిరాశపరిచారు. కానీ, రుతురాజ్ , కోహ్లీ మాత్రం ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెగ్యూలర్‌గా మనం రోహిత్-కోహ్లీ(RO-KO) షో చూస్తూ ఉంటాం. ఇవాళ మాత్రం రుతురాజ్-కోహ్లీ(RU-KO) షో చూస్తున్నాం. 28 ఓవర్లకు భారత్ స్కోర్ 193-2.
News December 3, 2025
‘సంచార్ సాథీ’పై వెనక్కి తగ్గిన కేంద్రం

సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైళ్లలో ప్రీ <<18439451>>ఇన్‌స్టాలేషన్<<>> తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సాథీ యాప్‌ను అన్ని కొత్త మొబైళ్లలో ప్రీ ఇన్‌స్టాలేషన్ చేస్తామన్న కేంద్రం ప్రకటనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తెస్తోందని, ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో యాప్ ప్రీ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది.


