News January 25, 2025

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Similar News

News November 26, 2025

సోఫాపై మరకలు పోవాలంటే..

image

* సోఫాపై మరకలు తొలగించడానికి ముందు ఒక తడి క్లాత్‌తో సోఫాను తుడిచి, బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్ చేసి మరకలున్న చోట ఈ పేస్ట్‌ను అప్లై చేసి 20నిమిషాల తర్వాత శుభ్రమైన తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు పోతాయి.
* బబుల్ గమ్ అంటుకున్న బట్టలను గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టినా/ఐస్‌క్యూబ్‌లతో రబ్ చేసినా ఫలితం ఉంటుంది.
* ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌ వాడాలి. దీంతో స్క్రీన్ దెబ్బతినదు.

News November 26, 2025

ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలు సీజ్: సీఎం

image

AP: రాష్ట్రంలో ప్రతి రోడ్డుప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేదా రోడ్డు ఇంజినీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్చరికలు జారీ చేసినా ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

News November 26, 2025

2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

image

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.