News January 25, 2025
మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని HYD ఓల్డ్ అల్వాల్‌లోని ఆమె నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సకలమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
Similar News
News November 20, 2025
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో వాద్రాపై PMLA కింద ఫిర్యాదు చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు అందజేసింది. కాగా, ఈ ఏడాది జులైలోనే వాద్రా స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు ఈడీ వెల్లడించింది.
News November 20, 2025
డాక్టర్ నిర్వాకం.. బాలుడికి ఫెవీక్విక్‌తో వైద్యం!

మీరట్(UP)లో జస్పిందర్ సింగ్ అనే వ్యక్తి కుమారుడు ఆడుతూ టేబుల్‌కు గుద్దుకున్నాడు. నుదుటిపై గాయం కావడంతో భాగ్యశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు రక్తం ఆపేందుకు గాయానికి ఫెవీక్విక్ వేసి వైద్యం చేశారని దంపతులు ఆరోపిస్తున్నారు. పిల్లాడి ఇబ్బంది చూసి మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు 3 గంటలు కష్టపడి గాయాన్ని శుభ్రంచేసి 4 కుట్లు వేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
పాము పొడ తెగులు నివారణ ఎలా?

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


