News May 3, 2024

ఝార్ఖండ్ మాజీ సీఎంకు కోర్టులో చుక్కెదురు

image

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ప్రొవిజినల్ బెయిల్ పిటిషన్‌నూ తోసిపుచ్చింది. అయితే, ఆయన కుటుంబీకుడి అంతిమ సంస్కారాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడకూడదని తేల్చిచెప్పింది. మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది జనవరి 31న సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది.

Similar News

News March 21, 2026

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.

News March 21, 2026

ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నావ్ రేవంత్: హరీశ్ రావు

image

TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టకు రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ‘మీరు ప్రారంభించే పనులు కాంగ్రెస్ చేసినవి కావు. శ్రమ మాది శిలాఫలకాలు కాంగ్రెస్‌వి. ఆయిల్ ఫామ్‌కు ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టే. దానిపై మీ వైఖరి మార్చుకోవాలి. 3 పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేట వస్తున్నారు’ అని హరీశ్ ప్రశ్నించారు.

News March 21, 2026

USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

image

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.