News May 12, 2024

మాజీ సీఎం SM కృష్ణ ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స

image

కర్ణాటక మాజీ సీఎం SM కృష్ణ(92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏప్రిల్ 29న ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు ICUలో చికిత్స అందిస్తున్నారు. కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. విదేశాంగమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుని 2017లో బీజేపీ గూటికి చేరారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Similar News

News November 21, 2025

వివేకా హత్య కేసు.. సీఐ తొలగింపు

image

AP: YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన <<17811370>>శంకరయ్యను<<>> ఉద్యోగం నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. కేసుకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని అందులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను డిస్మిస్ చేసింది.

News November 21, 2025

ముంబై డ్రగ్స్ పార్టీ.. హీరోయిన్ సోదరుడికి సమన్లు

image

ముంబై డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌కు యాంటీ నార్కోటిక్స్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. 20న విచారణకు గైర్హాజరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒర్రీ 26న రావాలని సూచించింది. సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించినట్టు డ్రగ్స్ వ్యాపారి మొహమ్మద్ సలీమ్ మొహమ్మద్ సుహైల్ షేక్ అంగీకరించినట్టు ముంబై కోర్టుకు తెలిపింది.

News November 21, 2025

అండమాన్‌లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.