News November 8, 2024

మాజీ సీఎంలు అసెంబ్లీకి రావట్లేదు.. ఎందుకు?

image

తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. TGలో ప్రతిపక్ష నేత KCR ఇప్పటివరకూ అసెంబ్లీకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు KCR అక్కర్లేదని, తాము చాలని KTR, హరీశ్ అంటున్నారు. తాజాగా AP మాజీ సీఎం జగన్ తాము అసెంబ్లీకి వెళ్లమని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షమంటూ ఉన్నది తామేనని, ఆ హోదా ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 16, 2025

చైల్డ్ కేర్ లీవ్స్‌లో పిల్లల వయోపరిమితి తొలగింపు

image

AP: ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్‌లో పిల్లల వయోపరిమితి నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగులు 180 రోజుల సెలవులను 10 విడతల్లో సర్వీసులో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. అయితే పిల్లల వయో పరిమితితో వాటిని వాడుకోలేకపోతున్నామని వారు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తివేస్తూ GO ఇచ్చింది. కాగా ఉమెన్, విడో, డివోర్స్, సింగిల్ మెన్ ఎంప్లాయీస్‌కి ఈ చైల్డ్ కేర్ లీవ్స్ కల్పిస్తున్నారు.

News December 16, 2025

ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

image

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)

News December 16, 2025

42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

image

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్‌గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.