News February 11, 2025

మాజీ క్రికెటర్‌కు సైబర్ నేరగాళ్ల ట్రాప్

image

సైబర్ నేరగాళ్లు తనను ట్రాప్ చేసేందుకు యత్నించారని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌ ట్విటర్లో తెలిపారు. ‘రూ.25వేలు కావాలంటూ ఓ సన్నిహితుడి నంబర్ నుంచి నాకు సందేశం వచ్చింది. అతడి ఫోన్ హ్యాక్ అయిందని నాకు ముందే తెలుసు. జీ పేలో పంపితే ఓకేనా అని అడిగాను. ఓ నంబర్ పంపించి పేమెంట్ స్క్రీన్ షాట్ కావాలన్నాడు. రూ.25వేలు సరిపోతాయా రూ.2.5 లక్షలు పంపించనా అని అడిగాను. ఇక మళ్లీ మెసేజ్ రాలేదు’ అని వెల్లడించారు.

Similar News

News February 11, 2025

బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం

image

ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.

News February 11, 2025

‘మద్యం’పై మాట తప్పిన ప్రభుత్వాలు.. మీరేమంటారు?

image

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపుపై మందుబాబులు ఫైరవుతున్నారు. APలో మద్యం ధరలు పెంచబోమని, తగ్గిస్తామని CM CBN, కూటమి నేతలు చెప్పి ఇప్పుడేమో బాటిల్‌పై రూ.10 పెంచారని మండిపడుతున్నారు. TGలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించబోమని, రేట్లు పెంచేది లేదని JANలో CM రేవంత్ ప్రకటించారు. నెల తిరక్కుండానే 15% పెంచి మాట తప్పారని దుయ్యబడుతున్నారు. ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి?

News February 11, 2025

ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

error: Content is protected !!