News May 1, 2024

రింకూకు మద్దతుగా మాజీ క్రికెటర్

image

నయా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్‌కు టీ20 వరల్డ్ కప్‌ మెయిన్ టీమ్‌లో కాకుండా రిజర్వ్ లిస్ట్‌లో చోటు దక్కడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేరారు. ధోనీ వదిలి వెళ్లిన ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేసే అర్హత రింకూకే ఉందని ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం ప్రకటించిన జట్టులో మార్పులకు ఈ నెల 25వరకు అవకాశం ఉంది.

Similar News

News March 4, 2026

ఇరాన్‌కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్‌కు?

image

ఇరాన్ ‘షాహెద్’, అమెరికా ‘LUCAS’లకు దీటుగా భారత్ శేష్‌నాగ్-150 డ్రోన్‌ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులోని NRT సంస్థ అభివృద్ధి చేస్తోన్న ఈ డ్రోన్ 25-40kgల ఆయుధాలతో 1,000km దూరంలోని టార్గెట్స్‌ను రీచ్ అవుతుంది. GPS సిగ్నల్స్ లేని చోట ‘విజువల్ నావిగేషన్’తో పనిచేయడం దీని స్పెషాలిటీ. యుద్ధ క్షేత్రంలో సొంత ఇంటెలిజెన్స్‌తో నిర్ణయాలు తీసుకొని దగ్గర్లోని ఇతర డ్రోన్లతో ఇది కమ్యూనికేట్ చేయగలదు.

News March 4, 2026

44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>నోయిడాలోని<<>> పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ 44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేేయనుంది. DM/MCh అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఏప్రిల్ 24న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,20,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు, SC, ST, OBC, EWS అభ్యర్థులకు రూ.3500. వెబ్‌సైట్: https://pgich.edu.in

News March 4, 2026

యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

image

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్‌ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.