News February 19, 2025

మాజీ క్రికెటర్ మృతి

image

ఫస్ట్ క్లాస్ క్రికెటర్, ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ రేగే(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. సునీల్ గవాస్కర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం మిలింద్ MCAకు అడ్వైజర్‌గా ఉన్నారు. 26 ఏళ్ల వయసప్పుడే హార్ట్‌ ఎటాక్‌కు గురైన ఆయన అప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మిలింద్ ముంబై తరఫున 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టారు. ఆయన మరణంతో MCA విషాదంలో మునిగిపోయింది.

Similar News

News February 21, 2025

నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం

image

ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. నీటి వాటాల కేటాయింపు, రెండు రాష్ట్రాల ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.

News February 21, 2025

అధికారికంగా విడిపోయిన చాహల్-ధనశ్రీ?

image

స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం. ‘45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. విడిపోయాక ఒత్తిడి నుంచి బయటపడ్డాననే అర్థంలో ధనశ్రీ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం గమనార్హం.

News February 21, 2025

మా దేశం విశ్వసనీయత కోల్పోయింది: పాక్ ఆర్థిక మంత్రి

image

ఆర్థిక అస్థిరత్వం కారణంగా తమ దేశం విశ్వసనీయతను కోల్పోయిందని పాకిస్థాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. ‘కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే అత్యవసరంగా ఆర్థిక సంస్కరణల్ని అమలుచేయాలి. ప్రస్తుతానికి ఆర్థిక సాయంగా ADB నుంచి 500 మిలియన్ డాలర్లు, IMF నుంచి బిలియన్ డాలర్లు రానున్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలే దేశ ఆర్థిక ప్రగతికి, స్థిరత్వానికి దోహదపడతాయి’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!