News February 7, 2025
కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు. ‘జనవరిలో మెడ నొప్పి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి.. ఇదేం ఫిట్‌నెస్.. ఏదైతేనేం కటక్ మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడారు.
Similar News
News February 7, 2025
గ్రూప్-1 ఫలితాలపై UPDATE
TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.
News February 7, 2025
బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. రేవంత్ యోచన?
TG: రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో CM రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు BCలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక Dy.CM పదవి ఉంటుందని టాక్. ST, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
News February 7, 2025
ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ
ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.