News April 6, 2025

మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అరెస్ట్

image

AP: మాజీ Dy.CM అంజద్ బాషా సోదరుడు అహ్మద్‌ అరెస్టయ్యారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. TDP MLA మాధవీరెడ్డిని దూషించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలోనూ దాడి కేసు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇరువర్గాలు రాజీ పడినప్పటికీ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేసినట్లు YCP వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Similar News

News April 7, 2025

పుండు మీద కారం.. గ్యాస్, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

image

గ్యాస్ సిలిండర్‌పై ₹50, పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ₹2 పెంపుపై కాంగ్రెస్ ఫైరయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం వేశారని మండిపడింది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం తీరు ఉందంది. ‘ఇవాళ ముడిచమురు ధర నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం పెంచింది. పైగా ప్రజలపై భారం పడదని డప్పు కొడుతోంది’ అని ట్వీట్ చేసింది.

News April 7, 2025

ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

image

ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ నియమితులయ్యారు. జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈసీబీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా దేశం కోసం ఆడేందుకు బ్రూక్ ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఆయన ఐపీఎల్ నుంచి వైదొలిగారు.

News April 7, 2025

సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టవద్దు: MP పోలీసులు

image

మధ్యప్రదేశ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్స్ వర్కర్ల‌పై ఎటువంటి వ్యభిచార కేసులు పెట్టరాదని, వారిని మానసికంగా హింసించరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ, హోటళ్లు, దాబాల యజమానులపై ITPయాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. అమాయక మహిళల్ని పడుపు వృత్తిలోకి తీసుకొస్తున్న వారిని కఠినంగా శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

error: Content is protected !!