News May 14, 2024

DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ

image

డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ.34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాధావాన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు సీబీఐ వెల్లడించింది.

Similar News

News March 26, 2026

మెదక్: ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు: మంత్రి

image

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.600 కోట్లకు పైగా, ఈహెచ్‌ఎస్ కింద రూ.130 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ హవర్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఉచిత వైద్యం అందించామని చెప్పారు. నెలకు సగటున రూ.89 కోట్లు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2400 కోట్లకు పైగా విడుదల చేశామని తెలిపారు.

News March 26, 2026

కరెంట్ అఫైర్స్

image

* JNTUH బీటెక్ విద్యార్థి శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హ్యాకథాన్ 2025’ పురస్కారం.
* సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879.
* నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, IIT మద్రాస్ రోడ్లపై ‘పొగమంచును హరించే’ టైటానియం డయాక్సైడ్ పూతలను పరీక్షిస్తున్నాయి.
* పుణేలోని శాస్త్రవేత్తలు Neoloboptera peninsularis అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు.

News March 26, 2026

BCCI హోమ్ షెడ్యూల్.. 9 వన్డేలు ఆడనున్న విరాట్, రోహిత్!

image

2026-27 హోమ్ సీజన్‌లో భారత జట్టు ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ను BCCI రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 27-అక్టోబర్‌17 మధ్య వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 T20ల సిరీస్‌లు జరగనున్నాయి. డిసెంబర్‌ 13-27 మధ్య శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20ల సిరీస్‌లు, జనవరి 3-9 మధ్య జింబాబ్వేతో 3 వన్డేలు, జనవరి 21-ఫిబ్రవరి 27 మధ్య ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడనుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 9 వన్డేలు ఆడే ఛాన్స్ ఉంది.