News September 27, 2024
గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్

AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. HYDలో నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయనను విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలున్నాయి. గత నెలలో GOVT ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న ACB కేసు నమోదు చేసింది.
Similar News
News February 11, 2026
మరో కేసులో అంబటి రాంబాబుకు బెయిల్

AP: వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆందోళనల కేసులో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
News February 11, 2026
ఆయిల్ పామ్: నత్రజని లోపం ఇలా గుర్తించండి

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.
News February 11, 2026
హంసలదీవి వేణుగోపాలస్వామి క్షేత్రం

కృష్ణాజిల్లా హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. పుట్టలో ఉన్న స్వామికి ఆవులు పాలు కార్చడం చూసి, గోపాలురు నిప్పు పెట్టగా స్వామి విగ్రహం భిన్నమైందని జనశృతి. ఆ విగ్రహం పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి, సాగర సంగమంలో స్నానమాచరిస్తే సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం 1977 ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వేలాది మందిని కాపాడింది.


