News October 6, 2025
భారత్, పాక్ మ్యాచులపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK క్రికెట్ మ్యాచులపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దౌత్యానికి వారధిగా పనిచేసిన ఈ క్రికెట్ మ్యాచ్‌లు, ఇప్పుడు రాజకీయపరమైన ఉద్రిక్తతలకు ప్రత్యామ్నాయంగా మారాయన్నారు. ఆర్థిక లాభం కోసం IND, PAKలను ICC ఒకే గ్రూపులో చేర్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా 2023-27 సైకిల్‌లో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ల బ్రాడ్ కాస్టింగ్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లుగా ఉంది.
Similar News
News March 31, 2026
కరెంట్ అఫైర్స్

* పారాలింపిక్ మెడలిస్ట్ షీతల్ దేవికి ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం
* తెలంగాణ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు సహా పది బిల్లులకు ఆమోదం
* బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా
* జీవితకాల కనిష్ఠాన్ని (₹95.12) తాకిన రూపాయి విలువ
* ₹3.24లక్షల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం
* PMAY, టిడ్కో స్కిమ్ కింద మరో 2.50లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం
News March 31, 2026
ఆందోళన వద్దు.. రూపాయి బానే ఉంది: నిర్మల

రూపాయి <<19515449>>పతనంపై<<>> ఆందోళన అక్కర్లేదని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 27 నాటికి రూపాయి 4.1% పడిపోయిందని తెలిపారు. అయితే సౌత్ కొరియన్ వాన్ (4.6%), థాయ్ భట్ (5.5%), ఫిలిప్పైన్ పెసో (4.8%) మొదలైన కరెన్సీలు ఇంతకన్నా ఎక్కువ క్షీణించాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఆర్థికలోటును అదుపులో ఉంచడంపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు.
News March 31, 2026
ఏప్రిల్‌లో పాకిస్థాన్‌కు 3వేల మంది భారతీయులు

భారత్ నుంచి ఏప్రిల్‌లో దాదాపు 3000 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్కడి పంజాబ్ ప్రావిన్స్‌లో ఏప్రిల్ 10న మొదలయ్యే బైశాఖి ఉత్సవాల్లో వీరు పాల్గొంటారు. దీంతో పాటు లాహోర్, కర్తపూర్, ఎమినాబాద్, ఫరూఖాబాద్, నాన్‌కనా సాహిబ్ వంటి సిక్కుల పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ ఏటా వీరి కోసం ప్రత్యేక ‘జథా’ వీసాలు కల్పిస్తోంది.


