News December 13, 2024
పింఛన్‌తో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్

తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తెలిపారు. తనకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. ‘యూరిన్ సమస్యతో బాధపడుతున్నా. నా కుటుంబం సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. గతంలో రెండు సర్జరీలకు సచిన్ సహాయం చేశారు. కపిల్ దేవ్ ఆఫర్ మేరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
చారకొండలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే బుధవారం చలి తీవ్రత కొంత తగ్గింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలంలో 17.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 18.5°C, వెల్దండలో 18.6°C, కల్వకుర్తిలో 18.9°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it
News December 3, 2025
APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <


