News April 1, 2025

ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

image

IPL: CSK బ్యాటర్ ధోనీపై మాజీ క్రికెటర్ ఉతప్ప తీవ్ర విమర్శలు చేశారు. RCB, RRతో జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ 9, 7 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చారో అర్థం కావట్లేదన్నారు. మొత్తానికే రాకపోయినా పెద్ద తేడా ఉండేది కాదని ఘాటుగా స్పందించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వస్తే మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ధోనీ తీరుపై ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News April 2, 2025

జపాన్‌లో భారీ భూకంపం

image

జపాన్‌లోని క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల థాయిలాండ్, అఫ్గానిస్థాన్‌, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.

News April 2, 2025

కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులకై విజ్ఞప్తి

image

AP: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. విమాన సర్వీసులూ అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

News April 2, 2025

వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

image

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.

error: Content is protected !!