News July 21, 2024

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా KKR మాజీ ప్లేయర్!

image

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను నియమించేందుకు BCCI అంగీకరించినట్లు సమాచారం. శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ BCCIకి సూచించారు. 2014 IPL సీజన్‌లో గంభీర్‌ KKR కెప్టెన్‌ కాగా మార్కెల్ జట్టులో ఉన్నారు. గంభీర్ లక్నోకి మెంటార్‌గా ఉన్నప్పుడు ఆయన బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News September 6, 2024

తెలుగు రాష్ట్రాలకు సురేశ్ ప్రొడక్షన్స్ రూ. కోటి సాయం

image

వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల సహాయార్థం సురేశ్ ప్రొడక్షన్స్ తరఫున రూ. కోటి విరాళమిస్తున్నట్లు నటుడు వెంకటేశ్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వరద బాధితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం. అందరం కలిసి రాష్ట్రాల్ని పునర్నిర్మించుకుని బలంగా నిలబడదాం’ అని పేర్కొన్నారు. తన పేరుతో పాటు రానా దగ్గుబాటి పేరు ఉన్న ఓ ప్రకటనను తన పోస్టుకు జత చేశారు.

News September 6, 2024

తెలంగాణ PCC చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్

image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. TPCC అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రెండు వారాల క్రితమే ఈ నియామక కసరత్తు పూర్తయినా తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు CM రేవంత్ రెడ్డి వద్ద ఉన్న టీపీసీసీ బాధ్యతలు మహేశ్ కుమార్ అందుకోనున్నారు.

News September 6, 2024

సెన్సెక్స్ 1,000, నిఫ్టీ 300 పాయింట్లు డౌన్

image

ఫెడ్ భావి నిర్ణయాలను ప్రభావితం చేసే అమెరికా ఉద్యోగ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్ట‌ర్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు కోల్పోయి 81,183 వద్ద‌, నిఫ్టీ 292 పాయింట్ల న‌ష్టంతో 24,852 వ‌ద్ద నిలిచాయి. FIIలు తమ అసెట్ మేనేజ్‌మెంట్ వివరాలు వెల్లడించాలన్న సెబీ డెడ్‌లైన్ కూడా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని తెలుస్తోంది.