News August 1, 2024

గనుల శాఖ మాజీ ఎండీ సస్పెండ్

image

AP: గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక తవ్వకాలు, గనుల్లో అక్రమాల ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.

Similar News

News February 5, 2026

42 ఏళ్ల పాటు నిరీక్షణ.. 100 ఏళ్ల వృద్ధుడికి దక్కిన న్యాయం

image

42 ఏళ్ల క్రితం అరెస్ట్ అయిన ఓ వృద్ధుడికి (100 Yrs) ఎట్టకేలకు న్యాయం దక్కింది. 1982లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ధనీరామ్‌ను అలహాబాద్‌ HC నిర్దోషిగా ప్రకటించింది. ఆయన చేసిన అప్పీల్‌ 4 దశాబ్దాల పాటు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, విచారణలో లోపాలతో పాటు వయసుని పరిగణనలోకి తీసుకుంది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థలో జాప్యంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

News February 5, 2026

నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

image

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.

News February 5, 2026

అర్ధరాత్రి నుంచి OTTలో ‘రాజాసాబ్’

image

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. అటు శివకార్తికేయన్, శ్రీలీల తదితరులు నటించిన ‘పరాశక్తి’ మూవీ ఈ నెల 7న జీ5లో విడుదల కానుంది.