News October 31, 2024
మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 31, 2024
లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలంటే?
దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు. వేద పంచాంగం ప్రకారం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి 8:11 వరకు, శుభ ముహూర్తం సాయంత్రం 5:31 నుంచి 9:55 గంటల వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:31-9:55 గంటల మధ్య లక్ష్మీపూజ చేయడం శుభప్రదమని వెల్లడించారు.
News October 31, 2024
TTD బోర్డులో జనసేన కోటా నుంచి ముగ్గురికి చోటు
జనసేన కోటాలో టీటీడీ పాలకమండలిలో ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణకు చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయికి చోటు కల్పించారు. మహేందర్ రెడ్డి 2009 నుంచి యువరాజ్యంలో చురుగ్గా పని చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.
News October 31, 2024
చీటింగ్ కేసులో గంభీర్‌పై విచారణకు ఆదేశం
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్‌పై ఓ చీటింగ్ కేసులో విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గంభీర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల జాయింట్ వెంచర్‌కు డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ కంపెనీ తమను మోసం చేసిందంటూ అందులో ఫ్లాట్లు కొన్నవాళ్లు చీటింగ్ కేసు పెట్టారు. అటు గంభీర్ తన పరిధికి మించి కంపెనీ నుంచి డబ్బు అందుకున్నట్లు కోర్టు గుర్తించింది.