News March 22, 2024

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి?

image

TG: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. నిన్న కాంగ్రస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం పక్కా అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంద్రకరణ్ రెడ్డి స్పందించాల్సి ఉంది.

Similar News

News January 20, 2026

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>కొచ్చిన్ <<>>షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి JAN 23 ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.41,795 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in/

News January 20, 2026

కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్‌ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్‌ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.

News January 20, 2026

అల్లరి నరేశ్ తాత మృతి

image

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాత ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వెంకట్రావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. అల్లరి నరేశ్ తండ్రైన ఈవీవీ 2011లో మరణించిన సంగతి తెలిసిందే. కాగా వెంకట్రావు భౌతికకాయానికి ఇవాళ సాయంత్రం నిడదవోలులోని కోరుమామిడిలో అంత్యక్రియలు జరగనున్నాయి.