News December 1, 2024

CM రేవంత్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్

image

TG: మాజీ సీఎం KCRకు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని CM రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను BRS మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. KCRకు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు తేలితే తాను MLA పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే KCR ఫామ్‌హౌస్ చూపిస్తానని రేవంత్‌కు ప్రశాంత్‌రెడ్డి ఆఫర్ చేశారు.

Similar News

News March 12, 2026

ఇరాన్ దాడిని ఖండించిన భారత్

image

గుజరాత్‌కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ దాడులు ప్రారంభమైన తొలి దశలోనే భారతీయులు సహా ఎంతో మంది ప్రాణాలు పోయాయని.. వీటి తీవ్రత మరింత పెరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా థాయ్ షిప్‌పై దాడి ఘటనలో 20 మందిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

News March 12, 2026

గ్యాస్ కొరత.. రాష్ట్రంలోని హోటళ్ల కీలక నిర్ణయం

image

కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులపై AP హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. గ్యాస్ ఇబ్బందుల దృష్ట్యా స్టార్‌ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలో కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని తెలిపింది.

News March 11, 2026

400 మిలియన్ బ్యారెళ్ల చమురు రిలీజ్ చేయనున్న IEA

image

అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకటించింది. క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు 32 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. IEA వద్ద ప్రస్తుతం 1.2 బిలియన్ బ్యారెళ్లకుపైగా చమురు నిల్వలు ఉన్నాయి. ఇలా IEA ఆయిల్ రిలీజ్ చేయడం ఇది ఆరోసారి. గతంలో 1991, 2005, 2011 సహా 2022లో రెండుసార్లు ఆయిల్ రిలీజ్ చేసింది.