News August 6, 2025

కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ MLA

image

TG: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. తనను చంపుతామని బెదిరింపులు వచ్చినా ఆయన పట్టించుకోలేదని వాపోయారు. ‘2009లో బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. 2014, 2018లోనూ ఎంపీ బీఫామ్ ఇవ్వాలని చూశారు. అచ్చంపేటలో నాపై దాడులు జరిగినా ప్రశ్నించలేదు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో పట్టించుకోలేదు’ అని విమర్శలు చేశారు.

Similar News

News August 7, 2025

ఈ నెలాఖరున ఇండియాకు పుతిన్?

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన ఇండియాకు వస్తారని సమాచారం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడి పత్రికలకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

News August 7, 2025

‘అమ్మా.. ఇక సెలవు’

image

AP: వడ్డీ వ్యాపారుల దోపిడీకి ఓ నిండు ప్రాణం బలైంది. అనంతపురం(D) గుత్తి సెంట్రల్ బ్యాంకులో సబ్ స్టాఫ్‌గా పనిచేసే రవికుమార్ ఓ వడ్డీ వ్యాపారిని ₹50వేల లోన్‌ అడగగా ₹15K పట్టుకుని ₹35K ఇచ్చారు. దానికి వడ్డీనే ₹1.20 లక్షలు చెల్లించిన రవి ఇక తన వల్ల కాదని బ్యాంకు వాష్‌రూంలో ఉరేసుకున్నాడు. ‘నా టైం అయిపోయింది. అప్పులే నాకు శాపమయ్యాయి. అమ్మా.. ఇక సెలవు. హరితా (భార్య) నన్ను క్షమించు’ అని సూసైడ్ నోట్ రాశారు.

News August 7, 2025

RRBలో 6,238 పోస్టులు.. ఇవాళే లాస్ట్

image

RRBలో 6,238 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. గ్రేడ్-1 సిగ్నల్-183 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 కింద 6,055 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం పోస్టును బట్టి రూ.19,900 నుంచి రూ.29,200 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250- రూ.500 వరకు ఉంది. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. <>rrbapply.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.