News September 14, 2024

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.

Similar News

News December 1, 2025

NRPT: 15 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఆదివారం మొత్తం 15 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కోటకొండలో ఇద్దరు, బొమ్మన్‌పాడులో ముగ్గురు, శాసన్‌పల్లి సర్పంచ్ స్థానానికి నలుగురు నామినేషన్లు వేశారు. మిగిలిన అప్పక్‌పల్లి, అంతర్, జాజాపూర్, షేర్‌నపల్లి, సింగారం, తిరుమలాపూర్ పంచాయతీలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు.

News December 1, 2025

పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

image

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.

News December 1, 2025

ఐటీ రంగంలో పెరుగుతున్న HIV కేసులు!

image

దేశంలో IT రంగానికి చెందిన వారిలో HIV కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) హెచ్చరించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందని NACO వర్గాలు చెప్పాయి. వ్యవసాయ కూలీల్లోనూ కేసులు ఎక్కువైనట్లు తెలిపాయి. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు టెస్టులు పెంచాలని సూచించాయి. ఎయిడ్స్ కేసుల్లో మహారాష్ట్ర(3,62,392), AP(2,75,528) టాప్‌లో ఉన్నాయి.