News October 13, 2025
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

TG: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్‌గూడలోని ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి APలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు పదవుల్లో పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News October 13, 2025
నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.
News October 13, 2025
నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘తక్షకుడు’ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ‘అత్యాశ ప్రారంభమైతే ప్రతీకారం వెంటాడుతుంది’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ డైరెక్టర్ వినోద్ దర్శకత్వం వహించారు.
News October 13, 2025
రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్: నాదెండ్ల

AP: పీడీఎస్(రేషన్) బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఇవి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, నిఘా విభాగం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.