News April 10, 2024
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు బెయిల్

BRS మాజీ MLA షకీల్ కుమారుడు రాహిల్‌కు హిట్ అండ్ రన్ కేసులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ ఆ తర్వాత దుబాయ్ పారిపోయారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 24, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతిపై 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జేసీ వెంకటేశ్వర్లుకు నోటీసును అందజేశారు.
* డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు(D)లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
* విజయనగరం(D)గుర్లలో స్టీల్‌ప్లాంట్ వద్దంటూ పలు గ్రామాల రైతులు ఆందోళనలు చేపట్టారు. ముందు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 24, 2025
VIRAL: 6 నెలల నిరీక్షణ తర్వాత తల్లి చెంతకు..!

ముంబై రైల్వే స్టేషన్లో మే 20న అదృశ్యమైన నాలుగేళ్ల ఆరోహి, ఆరు నెలల అంధకారం తర్వాత తల్లి ఒడికి చేరింది. మే 20న స్టేషన్లో తల్లి నుంచి ఆరోహి కిడ్నాప్‌కు గురైంది. వారణాసిలోని అనాథాశ్రమానికి చేరిన ఆ చిన్నారిని, పోలీసులు వేసిన పోస్టర్ల ఆధారంగా ఓ రిపోర్టర్ గుర్తించారు. ముంబైకి తిరిగి వచ్చిన ఆరోహి.. తన తల్లిదండ్రుల కంటే ముందుగా అక్కడున్న పోలీసు అధికారులను కౌగిలించుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.
News November 24, 2025
పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత ప్లేయర్లు

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత ప్లేయర్ల ఆటతీరు మారడం లేదు. నిలకడ లేమితో వికెట్లు పారేసుకుంటున్నారు. తాజాగా 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో IND 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఒక్కడే 58 రన్స్‌తో కాస్త రాణించారు. రాహుల్(22), సుదర్శన్(15), నితీశ్(10), పంత్(7), జడేజా(6), జురెల్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి టెస్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కోర్ 136/7.


