News September 18, 2024
జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే ఉదయభాను?

AP: వైసీపీ నేత, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు దీనిపై ఆయన సమాచారం ఇచ్చారని, బ్యానర్లు, జనసేన పార్టీ జెండా దిమ్మల పనులు చేయిస్తున్నట్లు టాక్. ఈనెల 24 లేదా 27న ఆయన JSP కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 26, 2025
రాజ్యాంగ రూపకల్పనలో అతివలు

భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. దీంట్లో గౌరీ భంజా చోళ కాంస్య నటరాజ విగ్రహ రూపాన్ని రాజ్యాంగంలో చిత్రీకరించారు. అలాగే జమునా సేన్, నిబేదిత బోస్, అమలా సర్కార్, బాని పటేల్ కూడా రాజ్యాంగంలోని పలు ఇల్యుస్ట్రేషన్లు చిత్రీకరించారు.


