News January 12, 2025
మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత

TG: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో TDP, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో BRS తరఫున పోటీ చేసి ఓడిన ఆయన 2024లో BSPలో చేరినా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
Similar News
News September 16, 2025
వచ్చే నెల విశాఖకు గూగుల్

AP: విశాఖకు వచ్చే నెల గూగుల్ సంస్థ రానుందని నిన్న కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ త్వరలో ఏర్పాటు కానుందన్నారు. కూటమి అధికారం చేపట్టాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భవిష్యత్‌లో భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.
News September 16, 2025
CAT-2025 దరఖాస్తుకు గడువు పొడిగింపు

CAT-2025 రిజిస్ట్రేషన్ గడువును SEP 20 వరకు పొడిగించారు. ఆసక్తిగల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న విడుదల చేస్తారు. క్యాట్ -2025 ప్రవేశ పరీక్ష NOV 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్సైట్: https://iimcat.ac.in/
News September 16, 2025
75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి

CBSE విద్యార్థులు టెన్త్, 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నల్ అసెస్మెంట్ తప్పనిసరి. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసెస్మెంట్ సాధ్యం కావట్లేదని బోర్డు పేర్కొంది. దీంతో కఠినంగా 75% హాజరు నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా హాజరుశాతం, క్లాస్‌రూం యాక్టివిటీస్ పెరుగుతాయని భావిస్తోంది.