News January 28, 2025

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్

image

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు గుంటూరు జిల్లా నాలుగో అదనపు కోర్టులో ఊరట దక్కింది. రూ.10 వేల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News November 17, 2025

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

image

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.