News January 13, 2025
మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత

AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.
Similar News
News January 1, 2026
ఫుల్ కిక్కు.. 4 రోజుల్లో రూ.1,230కోట్ల మద్యం అమ్మకాలు

TG: కొత్త ఏడాదికి ముందు 4 రోజుల్లోనే(28,29,30,31) రూ.1,230 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో మొత్తంగా రూ.5వేల కోట్ల మద్యం సేల్స్ జరిగాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడమూ కారణమని చెబుతున్నారు. ఒక్క నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం రికార్డు కాగా, 2023 డిసెంబర్లో రూ.4,291 కోట్ల అమ్మకాలు జరిగాయి.
News January 1, 2026
ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.
News January 1, 2026
న్యూ ఇయర్ రోజున ఈ పనులు వద్దు: పండితులు

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.


