News March 17, 2025
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

AP: వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 18, 2025
మహేశ్ బాబు ఔదార్యం.. ఫ్రీగా 4500 హార్ట్ ఆపరేషన్స్!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+కు చేరినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రతా ప్రారంభించారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.
News March 18, 2025
ఉస్మానియాలో నిరసనలపై నిషేధం ఎత్తివేయాలి: ఈటల

TG: రాష్ట్ర ఏర్పాటులో ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారని BJP MP ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. వర్సిటీలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలపడం విద్యార్థుల హక్కు అని, దానిని హరించాలని చూస్తే పుట్టగతులుండవని విమర్శించారు. ఇలా చేసిన KCRను ప్రజలు ఇంటికే పరిమితం చేశారన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News March 18, 2025
ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా

ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 21 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియా ట్వీట్ చేసింది. కాలేజీ జీవితం, నిజాయితీపై అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.