News June 11, 2024
క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్
సిక్కులపై అనుచిత <<13417892>>వ్యాఖ్యలు<<>> చేసినందుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ క్షమాపణలు చెప్పారు. ‘నా కామెంట్స్ పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్‌తో పాటు సిక్కులందరినీ క్షమాపణ కోరుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News January 13, 2025
విజయ్ హజారే ట్రోఫీ: సెమీస్ చేరిన జట్లివే
విజయ హజారే ట్రోఫీ తుది అంకానికి చేరింది. హరియాణా, కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర జట్లు సెమీస్ చేరాయి. ఈ నెల 15న హరియాణా, కర్ణాటక తలపడనుండగా, 16న విదర్భ, మహారాష్ట్ర పోటీ పడనున్నాయి. విజేతగా నిలిచిన టీమ్స్ ఈ నెల 18న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
News January 13, 2025
నేటి నుంచి మహా కుంభమేళా
నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.
News January 13, 2025
పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
TG: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్‌సైట్‌లు సంప్రదించండి.