News September 14, 2024
భారత జట్టుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వార్నింగ్

పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పర్యటన ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ అంశాలతో క్రికెట్‌కు అంతరాయం కలగకూడదన్నారు. టీమ్ ఇండియా తమ దేశంలో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు ఏ టోర్నీ కోసం ఆ దేశానికి వెళ్లదన్నారు. 2008 తర్వాత నుంచి ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు జట్లు ICC టోర్నీలోనే పోటీ పడ్డాయి.
Similar News
News January 31, 2026
విటమిన్ D ఉండే ఆహారాలు

మన ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ D చాలా అవసరం. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్నవారికి శరీర పెరుగుదల ఆగిపోతుంది. చలికాలంలో ఎక్కువ ఎండ అందుబాటులో లేని ప్రదేశాల్లో విటమిన్ డి లభించదు అలాంటప్పుడు కొన్ని విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి సాల్మన్, రెడ్ మీట్, గుడ్డు సొన, లివర్‌లో ఎక్కువగా విటమిన్ డి ఉంటుంది. ఇలా కాకుండా సప్లిమెంట్లు వాడాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
News January 31, 2026
కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.
News January 31, 2026
శుభకార్యాల్లో తమలపాకు ఎందుకు తప్పనిసరి?

మనం ప్రతి వేడుకల్లో తమలపాకును వాడుతాం. దీన్ని నాగవల్లి దళమని అంటారు. సకల దేవతల నివాసమని భావిస్తారు. దీని తొడిమలో లక్ష్మీదేవి, మధ్యలో పార్వతీదేవి, కొనభాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటారు. అందుకే పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో వాడుతారు. దీంతో తాంబూలం సమర్పిస్తే దైవిక శక్తి, సుస్థిరత చేకూరుతాయని నమ్మకం. ఆయుర్వేద పరంగా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే పూజలకు పచ్చగా, తాజాగా ఉన్న ఆకునే వాడాలి.


