News March 31, 2025

‘నోబెల్’కు పాక్ మాజీ PM ఇమ్రాన్ నామినేషన్

image

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్(PWA) ఈ నామినేషన్ వేసింది. పాక్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణలో ఆయన ఎనలేని సేవ చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడింది. గతంలో భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేసినందుకు గాను ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తూ పాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పాక్ జైల్లో ఉన్నారు.

Similar News

News April 2, 2025

గాంధీ ముని మనవరాలు కన్నుమూత

image

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.

News April 2, 2025

దేశానికి ఇవాళ బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల

image

AP: మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని YS షర్మిల ఆరోపించారు. పార్లమెంట్ ముందుకు ఆ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ బ్లాక్ డే అని తెలిపారు. వక్ఫ్ బిల్లును దేశంలోని 20కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని అన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు TDP, జనసేన మద్దతు పలకడం దారుణమని మండిపడ్డారు.

News April 2, 2025

నువ్వు దేవుడు సామీ.. వంటమనిషికి రూ.కోటి!

image

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ.కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజ్‌కు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఉన్న రూ.కోటి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు.

error: Content is protected !!