News October 7, 2025

మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

image

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 5, 2026

OTTలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఎప్పుడంటే?

image

రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 59 రోజుల తర్వాత OTTలో స్ట్రీమింగ్‌కు వస్తోంది.

News March 5, 2026

బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

image

CM పదవికి నితీశ్ కుమార్ <<19296674>>రాజీనామా<<>> చేసి RSకు వెళ్తారనే ప్రచారం రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత NDAలో కీలక భాగస్వామిగా మారిన నితీశ్‌కు కేంద్ర క్యాబినెట్‌లో పదవి దక్కుతుందని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ BJP ఆ ప్లాన్‌ను వెంటనే అమలుచేయలేదు. ఇప్పుడు నితీశ్‌ను కేంద్రమంత్రి చేసి, బిహార్‌లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో CM పోస్ట్ BJP ఖాతాలో చేరనుంది.

News March 5, 2026

ఇరాన్‌తో యుద్ధం.. 10కి 15 మార్కులేసిన ట్రంప్

image

ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో అమెరికా మిలిటరీ అసామాన్యంగా పోరాడుతోందని ట్రంప్ కొనియాడారు. ఈ సందర్భంగా తమ దేశ సైన్యానికి 10కి 15 మార్కులేశారు. తమతో పాటు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న మిత్రదేశాలు ఇప్పటికే పైచేయి సాధించాయని చెప్పారు. ప్రస్తుతం తాము కమాండింగ్ పొజిషన్‌లో ఉన్నామన్నారు. ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా ఇరానియన్స్ చనిపోయినట్లు US హ్యూమన్ రైట్స్ గ్రూప్ చెబుతోంది.