News December 26, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అస్వస్థత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 27, 2024
జపాన్లో ‘దేవర’ తాండవం.. ఎప్పుడంటే?
జపాన్ను తెలుగు సినిమాలు షేక్ చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ వచ్చే నెల 3న రిలీజ్కు సిద్ధమైంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కూడా జపానీస్లో రిలీజ్ కానుంది. 2025 మార్చి 28న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్స్ జనవరి 3 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘దేవర’ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
News December 27, 2024
వర్చువల్గా విచారణకు అల్లు అర్జున్
TG: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు విచారణకు వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొక్కిసలాట కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు రిమాండ్ విధించినా AA మధ్యంతర బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కోర్టుకు చేరుకున్నారు.
News December 27, 2024
ఇద్దరు మహానుభావులను కోల్పోయాం
మాజీ ప్రధాని, ఆధునిక భారత పితామహుడిగా పేరొందిన మన్మోహన్ సింగ్ను కోల్పోవడం దేశానికి తీరనిలోటు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించడంతో ఇద్దరు మహానుభావులను కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.