News January 2, 2025

సీఎంను కలిసిన మాజీ ఖైదీ.. ఎందుకంటే?

image

TG: కొత్త సంవత్సరం సందర్భంగా నిన్న నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన మాజీ ఖైదీ తరి నాగయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా అరెస్టైన రేవంత్‌కు చర్లపల్లి జైల్లో నాగయ్యే సపర్యలు చేశారు. పలు సందర్భాల్లో అతడి గురించి సీఎం బహిరంగంగానే ప్రస్తావించారు. ఇటీవల క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన నాగయ్య సీఎంను కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News January 8, 2026

సంక్రాంతికి ఈ రూట్‌లో స్పెషల్ రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా బెంగళూరు కంటోన్మెంట్, కలబురగి మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. ఈనెల 10 నుంచి మార్చి 1 వరకు రానుపోను 16 సర్వీసులు (ట్రైన్ నం.06207/06208) ఉంటాయని వెల్లడించింది. యెలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం, రాయిచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షాహాబాద్ స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగుతాయని తెలిపింది.

News January 8, 2026

నదీ గర్భంలో రాజధాని కట్టట్లేదు: నారాయణ

image

AP: నదీ గర్భంలో రాజధాని కట్టట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జగన్ రెండో దశ భూసేకరణపై చేసిన <<18799615>>కామెంట్ల<<>>పై స్పందించారు. ‘YCP ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదు. తప్పుడు ప్రచారం చేస్తే ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. 2వ విడత భూసేకరణలో భాగంగా భూమి ఇవ్వడానికి రైతులు ముందుకొస్తున్న టైంలో ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. CMగా పని చేసిన వ్యక్తి ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదు’ అని మండిపడ్డారు.

News January 8, 2026

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంజినీర్స్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ/మెరైన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌షిప్, BE(ఎలక్ట్రికల్), BLiSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.