News October 1, 2024
వందో బర్త్డే చేసుకున్న US మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్

అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మంగళవారం 100వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ ఘనత సాధించిన తొలి అధ్యక్షుడిగా, సుదీర్ఘకాలం బతికి ఉన్న ప్రెసిడెంట్గా చరిత్ర సృష్టించారు. 1924, అక్టోబరు 1న జార్జియాలో జన్మించిన కార్టర్, 1971-1981 మధ్యలో దేశాధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2015లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినా నేటికీ కార్టర్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం.
Similar News
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.oil-india.com/
News November 23, 2025
మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్ నివారణ, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.
News November 23, 2025
28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.


