News December 30, 2024

అమెరికా మాజీ అధ్యక్షుడి కన్నుమూత

image

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్(100) నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా పలు అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్న ఆయన జార్జియాలోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కార్టర్ కుటుంబం తెలిపింది. ఆయన యూఎస్ ప్రెసిడెంట్‌గా 1977-1981 మధ్యకాలంలో పనిచేశారు. అమెరికా అధ్యక్షుల్లో సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా కార్టర్ రికార్డ్ సృష్టించారు. 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

Similar News

News January 2, 2025

రోహిత్ ఆ హక్కు సంపాదించుకున్నారు: క్లార్క్

image

రోహిత్ శర్మ రిటైర్ కావాలంటూ వస్తున్న డిమాండ్లు అర్థరహితమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్‌ను తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. గత కొన్ని మ్యాచులుగా ఆయన రికార్డ్ బాలేదని ఒప్పుకుంటా. కానీ ఎప్పుడు తప్పుకోవాలో తానే నిర్ణయించుకోగల హక్కును ఆయన ఇన్నేళ్ల ఆటతో సంపాదించుకున్నారు. మరి రోహిత్ మనసులో ఏముందో ఆయనకే తెలియాలి’ అని వ్యాఖ్యానించారు.

News January 2, 2025

కార్ల్‌సన్, ఇయాన్ టైటిల్ షేరింగ్ వివాదాస్పదం

image

ప్రపంచ చెస్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంచుకోవాలని మాగ్నస్ కార్ల్‌సన్, ఇయాన్ నెపోమ్నియాచ్‌చీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇది చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. అయితే స్పష్టమైన విజేతను తేల్చకుండా ఇద్దర్నీ విజేతలుగా ప్రకటించడమేంటంటూ మాజీలు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. చెస్ ప్రపంచం కార్ల్‌సన్ చెప్పుచేతల్లో నడుస్తోందని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

News January 2, 2025

సంజయ్ రౌత్‌పై ఉద్ధవ్ అనుచరుల దాడి?

image

శివసేన(UBT) కీలక నేత సంజయ్ రౌత్‌పై ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ అనుచరులు దాడి చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధినేత నివాసమైన మాతోశ్రీలో స్వయంగా ఉద్ధవ్ కళ్ల ఎదుటే ఇది జరిగిందని అంటున్నారు. పార్టీ సమావేశం సందర్భంగా ఠాక్రే మద్దతుదారులకు, రౌత్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, అది దాడి వరకూ వెళ్లిందని సమాచారం. రౌత్ వల్ల పార్టీ నష్టపోయిందన్న భావనలో ఉద్ధవ్ ఉన్నట్లు తెలుస్తోంది.