News September 21, 2024
రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
ఈసారి IPL వేలంలో పాల్గొనట్లేదు: మ్యాక్స్వెల్

IPL-2026 వేలంలో తాను పాల్గొనట్లేదని ఆస్ట్రేలియన్ క్రికెటర్ <<18444972>>మ్యాక్స్వెల్<<>> ప్రకటించారు. అనేక సీజన్ల తర్వాత ఈ ఏడాది వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ తనను క్రికెటర్గా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలిపారు. వరల్డ్ క్లాస్ టీమ్మేట్స్, ఫ్రాంచైజీలతో పనిచేయడం తన అదృష్టమని, ఏళ్లుగా మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. త్వరలో కలుస్తానని పేర్కొన్నారు.
News December 2, 2025
పుతిన్ పర్యటన.. ఈ విషయాలు తెలుసా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు రానున్నారు. ఆయన ఇక్కడ ఉన్నంతసేపు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. తినేందుకు ఆహార పదార్థాలు, నీరు, ఇతర వస్తువులు రష్యా నుంచే తీసుకొస్తారు. క్రెమ్లిన్ చెఫ్ వండిన ఆహారాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తారు. టాయ్లెట్నూ అక్కడి నుంచే తెచ్చి, మలమూత్రాలను తీసుకెళ్తారు. ఆయన ఫోన్ వాడరు. ప్రత్యేకమైన బూత్ నుంచే టెలిఫోన్లో మాట్లాడుతారు.


