News September 21, 2024
పవన్ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోశయ్యతోపాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోశయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు.
Similar News
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.
News November 20, 2025
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.
News November 20, 2025
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.


