News July 22, 2024
వైసీపీకి మాజీ MLA మద్దాలి గిరి రాజీనామా

AP: గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ MLA మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు YCP అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ కేటాయించలేదు.
Similar News
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.
News November 21, 2025
ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.


