News June 3, 2024
కౌంటింగ్ ప్రక్రియలో ఫామ్‌లు.. ప్రాధాన్యతలు

✒ అనెగ్జర్ 38: ఓట్ల లెక్కింపునకు నియమితులైన పర్యవేక్షకులు, హెల్పర్స్‌కు జారీ చేసే సర్టిఫికెట్.
✒ ఫామ్ 21 E: సెగ్మెంట్‌లో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎవరు గెలిచారు అనే వివరాలు ఇందులో ఉంటాయి.
✒ ఫామ్ 22: గెలిచిన అభ్యర్థికి ఆర్వో జారీ చేసే సర్టిఫికెట్. దీన్ని అందుకున్న వ్యక్తులు అధికారికంగా ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైనట్లు.
Similar News
News January 30, 2026
ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఇవాళ మరోసారి తగ్గింది. కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఉదయం నుంచి రూ.20వేలు పతనమై రూ.4,05,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,69,200, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,100గా ఉంది.
News January 30, 2026
రోజూ గోరువెచ్చటి నీరు తాగితే..

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో మొటిమలు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ బావుండటంతో పాటు రక్త సరఫరా బాగా జరుగుతుంది. చర్మం తాజాగా ఉండటంతో పాటు ఫ్రీ ర్యాడికల్స్‌తో దెబ్బతిన్న చర్మ కణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాకుండా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గిపోయి వృద్ధ్యాప్య ఛాయలు కనిపించవు.
News January 30, 2026
ముగిసిన నామినేషన్ల పర్వం

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే కార్యాలయాల్లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రేపు వాటిని పరిశీలించనున్నారు. వచ్చే నెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదే రోజున సాయంత్రం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.


