News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన నిందితులు

image

TG: ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

Similar News

News November 5, 2025

అమరావతికి సలహాలు ఇవ్వండి

image

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి CRDA విజన్-2047 రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్‌లెన్స్ కోసం సలహాలు, అభ్యంతరాలను తెలపాలని ప్రజలు, సంస్థలను కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు <>https://crda.ap.gov.in/<<>>లోకి వెళ్లి స్క్రీన్‌పై కనిపించే లింక్‌పై క్లిక్ చేయాలి. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ వివరాలు ఇచ్చి అభిప్రాయాలను తెలపవచ్చు.

News November 5, 2025

పెరటి కోళ్ల పెంపకానికి అనువైన రకాలివే..

image

పెరటి కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాటుకోళ్ల కంటే పెరటి కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. వనరాజ, గ్రామప్రియ, గ్రామలక్ష్మి, వనశ్రీ, రాజశ్రీ, గాగస్, కడక్‌నాథ్, ఆసిల్ పెంపకానికి అనువైన పెరటి కోళ్ల రకాలు. వీటిలో కొన్ని 6 నెలల్లోనే 2-3 కిలోల బరువు పెరిగి, ఏటా 150-180 గుడ్లు పెడతాయి.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 5, 2025

దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

image

ఎకనామిక్ సర్వే (2024-25) ప్రకారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలసరి GDPలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. దీని తలసరి GDP ₹11.46 లక్షలు. ఆ తర్వాత గురుగ్రామ్ (₹9.05 లక్షలు), బెంగళూరు అర్బన్ (₹8.93L), గౌతమ్ బుద్ధ్ నగర్-నోయిడా, సోలాన్ (HP), నార్త్&సౌత్ గోవా, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై(₹6.57L), అహ్మదాబాద్ ఉన్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ వల్ల రంగారెడ్డి టాప్‌లో నిలిచింది.