News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ

image

TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Similar News

News November 7, 2025

మరోసారి ‘నో హ్యాండ్ షేక్’!

image

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్’ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్‌లో, మహిళల ప్రపంచ కప్‌లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇవాళ హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నీలోనూ ఇది రిపీట్ అయింది. ఇండియా మ్యాచ్ <<18225529>>గెలిచిన <<>>కొన్నిక్షణాలకే ప్రసారం ముగిసింది. ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. రెండు టీమ్స్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే ఉండిపోయాయని సమాచారం.

News November 7, 2025

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

image

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>

News November 7, 2025

అది పాకిస్థాన్‌ చరిత్రలోనే ఉంది: భారత్

image

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.