News December 24, 2024

ఫార్ములా ఈ-రేసు కేసు.. 2 రోజుల్లో నిందితులకు నోటీసులు!

image

TG: ఫార్ములా ఈ-రేసు కేసుపై ఈడీ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. రెండు రోజుల్లో నిందితులకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రేసుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను పరిశీలించిన అధికారులు, నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. HMDAకు చెందిన మరిన్ని పత్రాలను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News December 23, 2025

అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

image

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్‌లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.

News December 23, 2025

రూ.118 కోట్లలో సగం చెల్లించాల్సిందే.. ‘గీతం’కు హైకోర్టు షాక్

image

TG: హైకోర్టు ఆదేశాలతో HYD <<18584831>>గీతం<<>> యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని ఇటీవల వర్సిటీకి డిస్కం నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.

News December 23, 2025

శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయంటే?

image

* శీతాకాలంలో పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గి చర్మం పొడిబారడం, మడమలు పగలడం వంటి సమస్యలు వస్తాయి.
* సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర వంటి చర్మ సమస్యల వల్ల కూడా మడమల పగుళ్లు ఏర్పడతాయి. డయాబెటిస్, థైరాయిడ్ పరిస్థితులు కూడా మడమలు పగుళ్లకు కారణమవుతాయి.
* ఈ సీజన్‌లో చాలా మంది తక్కువగా నీరు తాగుతారు. దీనివల్ల శరీరంలో తేమ లోపిస్తుంది. ఇలా చర్మం పొడిగా మారి మడమల పగుళ్లకు కారణమవుతుంది.