News April 4, 2025

కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ రూపొందించండి: సీఎం రేవంత్

image

TG: విషయ పరిజ్ఞానంతో పాటు జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ ఛైర్మన్ ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో అమలవుతున్నవిద్యా విధానాలను ఛైర్మన్ ఆకునూరి మురళి, మాజీ IAS జయప్రకాశ్ నారాయణ, సీఎంకు వివరించారు.

Similar News

News April 12, 2025

సత్తా చాటిన అమ్మాయిలు

image

AP: ఇంటర్ ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు సత్తా చాటారు. రెగ్యులర్ ఫస్టియర్‌లో 66 శాతం మంది బాలురు ఉత్తీర్ణులైతే బాలికలు 75 శాతంతో పైచేయి సాధించారు. సెకండియర్‌లో అబ్బాయిలు 80 శాతం, అమ్మాయిలు 86 శాతం మంది పాసయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం, సెకండియర్‌లో అబ్బాయిలు 67 శాతం, అమ్మాయిలు 84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

News April 12, 2025

IPL: గుజరాత్‌ ఆటగాడికి గాయం

image

గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా వైదొలగినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తిరిగి న్యూజిలాండ్‌కు పయనమయ్యారని వెల్లడించాయి. SRHతో మ్యాచ్ సమయంలో ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. కాగా ఇవాళ లక్నోతో GT తలపడనుంది.

News April 12, 2025

పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్

image

AP: ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

error: Content is protected !!